Genesis 17:13
నీ ఇంట్లో పుట్టిన వారికీ, మీరు వెల పెట్టి కొనుక్కున్న వారికీ తప్పకుండా సున్నతి జరగాలి. ఆ విధంగా నా నిబంధన మీ శరీరంలో శాశ్వత నిబంధన గా ఉంటుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 9:16ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు.
Genesis 15:3నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు.
Genesis 37:36మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, ఫరో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు.
Exodus 12:44మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు.
Exodus 21:4ఒకవేళ వాడి యజమాని అతనికి భార్యగా ఒక స్త్రీని అప్పగించినప్పుడు ఆమెకు ఆ దాసుడి ద్వారా కొడుకులు గానీ, కూతుళ్ళు గానీ పుట్టినట్టయితే ఆ భార్య, పిల్లలు ఆమె యజమానికి సొంతం అవుతారు, వాడు ఒంటరిగానే వెళ్లిపోవాలి.
Leviticus 22:11అయితే యాజకుడు తన డబ్బుతో కొనుక్కున్న వాడు, అతని ఇంట్లో పుట్టినవాడు అతడు తినే ఆహారం తినవచ్చు.