Genesis 21:30
దానికి అబ్రాహాము “ఈ బావిని నేనే తవ్వించాననడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెలను నువ్వు తీసుకోవాలి” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 26:18అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ళ బావులను తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రాహాము మరణం తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రాహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు.
Genesis 31:52నీకు హాని చేయడానికి నేను ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నీ దగ్గరికి రాకుండా, నువ్వు నాకు హాని చేయడానికి ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నా దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ కుప్ప, ఈ స్తంభమూ సాక్షి.
Joshua 24:27యెహోషువ ప్రజలందరితో “గమనించండి, యెహోషువ మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. కాబట్టి అది మనమీద సాక్షిగా ఉంటుంది. మీరు మీ దేవుని విసర్జిస్తే అది మీ మీద సాక్షిగా ఉంటుంది” అన్నాడు.