Genesis 24:7
నా తండ్రి ఇంటి నుండీ, నా + 24:7 నా జన్మ భూమి.బంధువుల దేశం నుండీ నన్ను తీసుకు వచ్చి ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని పరలోకపు దేవుడైన యెహోవా నాకు ప్రమాణం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అక్కడనుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకుని వస్తావు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
6అప్పుడు అబ్రాహాము “ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు.
Cross References
Genesis 12:1యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల + 12:1 లేక నీవు పుట్టిన స్థలం. దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు.
Genesis 13:15నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను.
Genesis 17:8నీకూ నీ తరువాత నీ సంతానానికీ ప్రస్తుతం నువ్వు పరదేశిగా ఉన్న భూమిని, అంటే కనాను దేశాన్నంతా ఇస్తాను. దాన్ని శాశ్వత సంపదగా ఇచ్చి వారికి దేవుడిగా ఉంటాను.”
Genesis 24:40అతడు ‘నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను. ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి నా తండ్రి వారసులనుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకు వస్తావు.
Genesis 26:24ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి భయపడవద్దు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను.”
Exodus 23:20నేను సిద్ధపరచిన దేశానికి మీరు క్షేమంగా చేరుకోవడానికి మార్గంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు ముందుగా వెళ్ళడానికి ఒక దూతను పంపిస్తున్నాను.