Genesis 27:4
దాన్ని నాకోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోక ముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 24:60అప్పుడు వాళ్ళు రిబ్కాతో “మా సోదరీ, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి. 1 నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారు గాక!” అంటూ ఆమెను దీవించారు.
Genesis 27:14కాబట్టి యాకోబు రెండు మేక పిల్లలను పట్టుకుని వాటిని తన తల్లి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది.
Genesis 27:25అప్పుడు ఇస్సాకు “ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు.
Genesis 27:31అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. “నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అని తండ్రితో అన్నాడు.
Genesis 48:9యోసేపు “వీళ్ళు నా కొడుకులు. వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు” అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు “నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకు రా” అన్నాడు.
Genesis 49:28ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.