Genesis 39:3
యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు.
Cross References
Genesis 21:20దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.
Genesis 21:23నువ్వు నన్ను, నా కొడుకుని, నా మనుమళ్ళను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి. నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్లా, నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్లా చూపించు” అన్నాడు.
Genesis 26:28అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు. “యెహోవా కచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని అంటే నీకూ మాకూ మధ్య నిబంధన ఉండాలని కోరుతున్నాం.
Genesis 30:30నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను?” అన్నాడు.
Genesis 39:23యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు.
Joshua 1:7అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు.