Haggai 2:15
ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించింది మొదలు ఆ వెనుక మీకు సంభవించినదాన్ని ఆలోచన చేసుకోండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Ezra 4:24కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.
Isaiah 5:12వారు సితారా, స్వరమండలం, తంబుర, సన్నాయి వాయిస్తూ ద్రాక్షారసం తాగుతూ విందు చేస్తారు గానీ యెహోవా పని గురించి ఆలోచించరు. 1 ఆయన తన చేతితో చేసిన వాటిని లక్ష్యపెట్టరు. 1
Haggai 1:5కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.
Haggai 2:18మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందు తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి, అంటే యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి.
Malachi 3:8మానవుడు దేవుని సొత్తు దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా సొత్తు దొంగిలించారు. ‘ఏ విషయంలో మేము నీదగ్గర దొంగిలించాం?’ అని మీరు అంటారు. దశమ భాగం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వకుండా దొంగిలించారు.
1 Corinthians 11:31అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు.