Hebrews 9:1
మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then verily the first covenant had also ordinances of divine service, and a worldly sanctuary.
In Context
Cross References
Exodus 25:8నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.
Leviticus 18:30కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.”
Numbers 9:12మర్నాటి ఉదయానికి దానిలో దేన్నీ మిగల్చకూడదు. దాని ఎముకల్లో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాకి సంబంధించిన నియమాలన్నిటినీ వారు పాటించాలి.
Luke 1:6వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు.
Hebrews 8:2మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు.
Hebrews 8:13ఆయన ‘కొత్త ఒప్పందం’ అని చెప్పడం వల్ల, మొదటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు. దేన్నైతే ఆయన పాతది అని ప్రకటించాడో అది మాసిపోవడానికి సిద్ధంగా ఉంది.