The Bible Software
bible.softwareHoseaHosea 5 › Hosea 5:13

Hosea 5:13

తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు. తన పుండును యూదా చూశాడు. ఎఫ్రాయిము అష్షూరీయుల దగ్గరికి వెళ్ళాడు. ఆ గొప్ప రాజు దగ్గరికి రాయబారులను పంపాడు. అయితే అతడు నిన్ను బాగు చేయలేకపోయాడు. నీ పుండు నయం చేయలేకపోయాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

When Ephraim saw his sickness, and Judah saw his wound, then went Ephraim to the Assyrian, and sent to king Jareb: yet could he not heal you, nor cure you of your wound.

In Context

12ఎఫ్రాయిమీయుల పాలిట చెద పురుగులాగా, యూదావారికి కుళ్లిపోజేసే వ్యాధి లాగా నేను ఉంటాను.

14ఎందుకంటే నేను ఎఫ్రాయిమీయులకు సింహం లాగా ఉంటాను. యూదావారికి కొదమ సింహం వలే ఉంటాను. నేనే వారిని చీల్చేసి వెళ్ళిపోతాను. నేనే వారిని తీసుకుపోతాను. వారిని విడిపించే వాడొక్కడు కూడా ఉండడు.

Read all of Hosea 5

Cross References

2 Kings 15:29ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు.

2 Chronicles 28:16ఆ కాలంలో ఎదోమీయులు మళ్ళీ వచ్చి యూదాదేశాన్ని పాడుచేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు.

2 Chronicles 28:21ఆహాజు, యెహోవా మందిరంలో నుంచి, రాజ భవనంలో నుంచి, అధికారుల దగ్గర నుంచి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకిచ్చాడు, కానీ దాని వల్ల కూడా అతనికి ఏ ప్రయోజనమూ లేక పోయింది.

Jeremiah 30:14నీ ప్రేమికులంతా నిన్ను మరిచిపోయారు. వాళ్ళు నీ కోసం చూడరు. ఎందుకంటే, అధికమైన నీ పాపాలనుబట్టి, నీ గొప్ప దోషాన్నిబట్టి, ఒక కఠినమైన యజమాని పెట్టే క్రమశిక్షణ కింద నిన్ను ఉంచి, ఒక శత్రువు గాయపరిచినట్టు నేను నిన్ను గాయపరిచాను. 1

Hosea 7:11ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయిపోయింది. అది ఐగుప్తీయులను పిలుస్తుంది. తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది.

Hosea 10:6వారు గొప్ప రాజుకు కానుకగా అష్షూరు దేశంలోకి బందీలుగా వెళ్ళిపోతారు. ఎఫ్రాయిము అవమానం పాలవుతుంది. ఇశ్రాయేలు వారు విగ్రహాల మాటలు విన్నందుకు సిగ్గు పడతారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Hosea 5:13

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Hosea 5:12Hosea 5Hosea 5:14 →