Hosea 9:6
చూడండి, వారు నాశనం తప్పించుకుంటే. ఐగుప్తుదేశం వారికి పోగయ్యే స్థలంగా ఉంటుంది. మెంఫిస్ పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉంటుంది. వారి అపురూపమైన వెండివస్తువులను దురదగొండి మొక్కలు ఆవరిస్తాయి. ముండ్లకంప వారి నివాస స్థలంలో పెరుగుతుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
5నియామక పండగల్లో, యెహోవా పండగ దినాల్లో మీరేమి చేస్తారు?
Cross References
Deuteronomy 28:63మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ది చేయడంలో మీ యెహోవా దేవుడు మీపట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చెయ్యడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు.
2 Kings 13:7అశ్వికులు 50 మంది, రథాలు పది, కాల్బలం పదివేలమంది మాత్రమే యెహోయాహాజు దగ్గర మిగిలారు. మిగిలిన వారిని సిరియా రాజు తూర్పారబట్టిన పొట్టు లాగా నాశనం చేశాడు.
Proverbs 24:31ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది.
Isaiah 7:23ఆ దినాన వెయ్యి వెండి నాణేల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లు ఉండే ప్రతి స్థలంలో ముళ్ళతుప్పలు, బ్రహ్మజెముడు చెట్లు పెరుగుతాయి. 1
Isaiah 19:13సోయను అధిపతులు మూర్ఖులయ్యారు. నోపు పట్టణ అధిపతులు మోసపోయారు. ఐగుప్తు జాతులకు మూల స్తంభాలుగా ఉన్న వీళ్ళు ఐగుప్తును తప్పుదారి పట్టించారు. 1
Isaiah 32:13నా ప్రజల భూమిలో ముళ్ళ తుప్పలూ, గచ్చపొదలూ పెరుగుతాయి. 1 వేడుకలు జరిగే పట్టణంలో ఒకప్పుడు సంతోషం నిండిన ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటుంది. పైనుండి ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ, 1