Isaiah 19:18
ఆ రోజున కనాను భాషలో మాట్లాడే పట్టణాలు ఐదు ఐగుప్తు దేశంలో ఉంటాయి. ఆ పట్టణాల్లో ప్రజలు “మేము సేనల ప్రభువు యెహోవా ప్రజలం” అని ప్రమాణం చేస్తారు. ఈ పట్టణాల్లో ఒక దాన్ని “నాశనపురం” అని పిలుస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 11:1అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
Nehemiah 10:29వారితోపాటు వారి భార్యలు, కొడుకులు, కూతుళ్ళు, తెలివితేటలున్న వారంతా తమ బంధువులతో ఏకమయ్యారు.
Isaiah 2:11మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు. 1 మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు. 1 ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 1
Isaiah 14:1యెహోవా యాకోబు మీద జాలిపడతాడు. ఆయన మళ్ళీ ఇశ్రాయేలును ఎంపిక చేసుకుని వారికి తమ స్వదేశంలో పూర్వ క్షేమ స్థితి కలిగిస్తాడు. పరదేశులు వాళ్ళల్లో కలిసి, యాకోబు సంతతితో జత కూడుతారు. 1
Isaiah 19:21ఐగుప్తు ప్రజలకు యెహోవా తనను తెలియపరచుకుంటాడు. ఆ రోజున ఐగుప్తు ప్రజలు యెహోవాను తెలుసుకుంటారు. వాళ్ళు ఆయనను బలులతో, కానుకలతో ఆరాధిస్తారు. యెహోవాకు మొక్కుకుని ఆ మొక్కుబళ్ళు చెల్లిస్తారు.
Isaiah 45:23నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందనీ, ప్రతి నాలుకా ‘యెహోవా తోడు’ అని అంటుందనీ నేను ప్రమాణం చేశాను. 1 నా న్యాయ వాక్కు బయలుదేరింది. అది వ్యర్ధం కాదు. 1