Isaiah 30:17
మీలో మిగిలి ఉన్న వాళ్ళు ఏదో పర్వతంపై ఒక జెండా కర్రగానో, లేదా ఏదో కొండపై జెండా గానో మిగిలే దాకా మీరు ఒక్కడికి భయపడి వెయ్యి మంది పారిపోతారు. ఐదుగురి భయం చేత మీరంతా పారిపోతారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:8మీలో ఐదుగురు వంద మందిని తరుముతారు. వంద మంది పదివేల మందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట కత్తివాత కూలిపోతారు.
Leviticus 26:36మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశాల్లో ఉండగా వారి హృదయాల్లో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పారిపోతారు. ఖడ్గం నుండి తప్పించుకోడానికి పారిపోతున్నట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరుమేవాడు ఎవరూ లేకుండానే పడిపోతారు.
Deuteronomy 32:30వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, 1 యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, 1 ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? 1 పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు? 1
Nehemiah 1:2నా సోదరుల్లో హనానీ అనే ఒకడు, ఇంకా కొందరు యూదులు వచ్చారు. చెరలోకి రాకుండా తప్పించుకుని, అక్కడ మిగిలిపోయిన యూదుల గురించీ యెరూషలేమును గురించీ నేను వారిని అడిగాను.
Isaiah 1:7మీ దేశం పాడైపోయింది. 1 మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి. 1 మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు. 1 తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు. 1
Isaiah 6:13దానిలో పదవ భాగం మాత్రం మిగిలిపోయినా అది కూడా నాశనమౌతుంది. 1 సింధూర మస్తకి వృక్షాలను నరికి వేసినా తరువాత మిగిలి ఉండే మొద్దులాగా అది ఉంటుంది. 1 అలాటి మొద్దులో పరిశుద్ధమైన చిగురు ఉంది.