Isaiah 41:23
ఇకముందు జరగబోయే సంగతులను తెలియజెప్పండి. 1 అప్పుడు మీరు దేవుళ్ళని మేం ఒప్పుకుంటాం. 1 మేము విస్మయం చెందేలా మేలైనా, కీడైనా, ఏదైనా పని చేయండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
24మీకు ఉనికి లేదు. మీ పనులు శూన్యం. మిమ్మల్ని ఆశించేవారు అసహ్యులు. 1
Cross References
Isaiah 19:12నీ జ్ఞానులు ఎక్కడ ఉన్నారు? సేనల ప్రభువైన యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన ప్రణాళికను వాళ్ళని చెప్పనియ్యి. 1
Isaiah 44:7ఆదిలో నా ప్రజలను నియమించినప్పటి నుండి నాలాగా విషయాలను వెల్లడి చేస్తూ వచ్చిన వాడెవడు? 1 అలాంటివాడు ఉంటే నాకు చెప్పండి. వారు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలియజెప్ప గలిగేవారై ఉండాలి. 1
Isaiah 45:7వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను. 1
Isaiah 46:9చాల కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాలాంటి వాడు ఎవడూ లేడు. 1
John 13:19అది జరగక ముందే, ఇప్పుడు దీన్ని మీతో చెబుతున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు నేను ఉన్నవాణ్ణి అని మీరు నమ్మాలని నా ఉద్దేశం.