The Bible Software
bible.softwareIsaiahIsaiah 58 › Isaiah 58:12

Isaiah 58:12

పురాతన శిథిలాలను నీ ప్రజలు మళ్ళీ కడతారు. అనేక తరాల నుంచి పాడుగా ఉన్న పునాదులను నువ్వు మళ్ళీ వేస్తావు. నిన్ను “గోడ బాగుచేసేవాడు, నివాసాల కోసం వీధులు మరమ్మత్తు చేసేవాడు” అంటారు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And they that shall be of thee shall build the old waste places: thou shalt raise up the foundations of many generations; and thou shalt be called, The repairer of the breach, The restorer of paths to dwell in.

In Context

11అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు. 1 నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు. 1 ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు. 1

13విశ్రాంతి దినాన ప్రయాణం చేయకుండా, నా ప్రతిష్ఠిత దినాన్ని నీ సొంత ఆహ్లాదం కోసం వాడకుండా ఉన్నావనుకో. 1 విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగా భావిస్తూ యెహోవాకు చెందిన విషయాలను పవిత్రంగా గౌరవంగా చేస్తున్నావనుకో. 1 నీ సొంత వ్యాపారం వదిలేసి విశ్రాంతి దినాన్ని సొంత ఆహ్లాదం కోసం వాడకుండా నీ సొంత మాటలు మాట్లాడకుండా గౌరవిస్తున్నావనుకో. 1

Read all of Isaiah 58

Cross References

Nehemiah 2:17వారితో నేను “మనం ఎంత కష్టంలో ఉన్నామో మీకు తెలుసు. యెరూషలేము పాడుబడి పోయింది. కోట తలుపులు తగలబడి పోయాయి. ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. రండి, యెరూషలేము ప్రాకారం తిరిగి కడదాం, ఇకపై మనం నింద పాలు కాకూడదు” అన్నాను.

Nehemiah 6:1నేను పగుళ్ళు ఏవీ లేకుండా గోడలు కట్టే పని పూర్తి చేశాను. ఇంకా తలుపులు నిలబెట్టలేదు. ఈ విషయం సన్బల్లటుకూ, టోబీయాకూ, అరబ్బు వాడు గెషెంకూ, ఇంకా మా శత్రువుల్లో మిగతా వారికి తెలిసింది.

Isaiah 49:8యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 “అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను. 1 దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ 1 నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను. 1

Isaiah 52:9యెరూషలేము శిథిలాల్లారా! కలిసి ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజలను ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు. 1

Jeremiah 31:38యెహోవా ఇలా అంటున్నాడు, 1 “హనన్యేలు గోపురం మొదలుకుని మూలగుమ్మం వరకూ నా కోసం ఆ పట్టణం పునర్నిర్మాణం అయ్యే రోజులు వస్తున్నాయి. 1

Ezekiel 36:8ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలోనే ఇశ్రాయేలీయులైన నా ప్రజలు మీ దగ్గరికి వస్తారు. మీరు చిగురుపెట్టి వారి కోసం పళ్ళు కాస్తారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Isaiah 58:12

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Isaiah 58:11Isaiah 58Isaiah 58:13 →