Isaiah 7:18
ఆ దినాన దూరంగా ఐగుప్తు ప్రవాహాల దగ్గర ఉన్న జోరీగలను, అష్షూరు దేశపు కందిరీగలను యెహోవా ఈల వేసి పిలుస్తాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 8:21నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి.
Deuteronomy 1:44అప్పుడు అక్కడ ఉన్న అమోరీయులు మీకెదురు వచ్చి, కందిరీగల్లాగా మిమ్మల్ని హోర్మా వరకూ తరిమి శేయీరులో మిమ్మల్ని హతం చేశారు.
Joshua 24:12నేను మీకు ముందుగా కందిరీగలను + 24:12 కందిరీగలను బెదరు, నిర్గ 23:28 చూడండి పంపాను. నీ కత్తి వల్ల నీ విల్లు వల్ల కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేశాయి.
Psalms 105:31ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి. 1
Isaiah 5:26ఆయన దూర ప్రజలకు సంకేతంగా జెండా ఎత్తుతాడు. 1 భూమి కొనల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. 1 అదిగో, వారు ఆలస్యం లేకుండా వేగంగా వస్తున్నారు. 1
Isaiah 13:5సర్వలోకాన్ని పాడు చెయ్యడానికి దూర దేశం నుంచీ, ఆకాశపు అంచుల నుంచీ యెహోవా, ఆయన తీర్పు అమలు చేసే సాధనాలు వస్తున్నారు. 1