యిర్మీయా 1:19
వారు నీతో యుద్ధం చేస్తారు గాని నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను కాబట్టి వారు నీపై విజయం పొందలేరు. ఇదే యెహోవా వాక్కు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 129:2నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు. 1
Jeremiah 11:19అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు. 1
Jeremiah 15:10అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు. 1
Jeremiah 18:18అప్పుడు ప్రజలు ఇలా అన్నారు. “యిర్మీయా మీద కుట్ర పన్నుదాం రండి. యాజకులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు. తెలివిగలవాళ్ళు సలహాలివ్వకుండా ఉండరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడు ప్రకటించే మాటలేమీ పట్టించుకోకుండా మన మాటలతో అతన్ని ఎదుర్కొందాం రండి.” 1
Jeremiah 20:10చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు. 1
Jeremiah 26:8అయితే యిర్మీయా యెహోవా చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ప్రజలందరికీ చెప్పడం ముగించిన తరువాత యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా అతణ్ణి పట్టుకుని “నువ్వు తప్పకుండా చావాలి.