యిర్మీయా 11:23
వారిలో ఎవరూ మిగలరు. ఎందుకంటే నేను వారికి తీర్పు తీర్చిన సంవత్సరం వారి పైకి మహా విపత్తును పంపిస్తాను.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Jeremiah 5:9అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు. 1
Jeremiah 6:9సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘ద్రాక్ష పండ్లను ఏరే విధంగా ఇశ్రాయేలులో మిగిలిన వారిని ఏరుతారు. 1 ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెల మీద మళ్ళీ చెయ్యి వేసినట్టు నీ చెయ్యి వాళ్ళ మీద వేయి.’” 1
Jeremiah 11:19అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు. 1
Jeremiah 44:27నేను వాళ్ళ క్షేమం కోసం కాకుండా వాళ్ళ వినాశనం కోసమే వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నాను. ఐగుప్తులోని యూదులంతా కత్తి మూలంగానో కరువు మూలంగానో చనిపోతారు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలడు. వారు ఖడ్గం వల్ల గానీ కరువు వల్ల గానీ క్షీణించిపోతారు. ఐగుప్తు దేశంలో ఉన్న యూదా వారంతా ఎవరూ మిగలకుండా అంతమై పోతారు.
Jeremiah 48:44“భయంతో పారిపోయే వాళ్ళు గుంటలో పడతారు. 1 గుంటలో నుండి తప్పించుకుని పైకి వచ్చిన వాళ్ళు వలలో చిక్కుకుంటారు. 1 వాళ్ళపై ప్రతీకారం చేసే సంవత్సరంలో నేనే దీన్ని వాళ్ళ పైకి తీసుకు వచ్చాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1
Hosea 9:7శిక్షా దినాలు వచ్చేస్తున్నాయి. ప్రతికార దినాలు వచ్చేశాయి. “ప్రవక్తలు బుద్ధిలేని వారు, ఆత్మ మూలంగా పలికే వారు వెర్రివారు.” ప్రజల విస్తార దోషం, వారు చూపిన తీవ్ర శత్రుత్వం మూలంగా ఇశ్రాయేలువారు ఇది తెలుసుకుంటారు.