యిర్మీయా 15:1
అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 19:27ఉదయమైంది. అబ్రాహాము లేచి తాను అంతకుముందు యెహోవా సముఖంలో నిలబడిన చోటుకు వచ్చాడు.
Numbers 14:13మోషే యెహోవాతో “అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. ఎందుకంటే నీ బలంతో నువ్వు ఈ జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు ఈ దేశ వాసులతో ఈ విషయం చెప్తారు.
1 Samuel 7:9సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.
2 Kings 17:20అప్పుడు యెహోవా ఇశ్రాయేలు వంశస్థులను తృణీకరించి, వాళ్ళను బాధపెట్టి, దోపిడీగాళ్ళ చేతికి అప్పగించి, వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్లగొట్టాడు.
Psalms 106:23అప్పుడు ఆయన “నేను వారిని నశింపజేస్తాను” అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు. 1
Jeremiah 7:15మీ సోదరులైన ఎఫ్రాయిము సంతానాన్ని నేను వెళ్లగొట్టినట్టు మిమ్మల్ని కూడా నా సన్నిధి నుండి వెళ్లగొడతాను.