యిర్మీయా 17:27
అయితే మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించి, ఆ దినాన బరువులు మోస్తూ యెరూషలేము ద్వారాల గుండా ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట వినకపోతే నేను దాని ద్వారాల్లో మంట పెడతాను. అది రాజ భవనాలను కాల్చివేస్తుంది. దాన్ని ఆర్పడం ఎవరి తరమూ కాదు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 32:22నా కోపాగ్ని రగులుకుంది. 1 పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. 1 భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. 1 పర్వతాల పునాదులను రగులబెడుతుంది. 1
2 Kings 25:9యెహోవా మందిరాన్నీ, రాజనగరునూ, యెరూషలేములో ఉన్న ఇళ్ళన్నీ, గొప్పవాళ్ళ ఇళ్ళన్నీ అగ్నితో తగల బెట్టించాడు.
Isaiah 1:20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, 1 కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” 1 యెహోవా నోరు ఈ మాట పలికింది. 1
Isaiah 9:18దుర్మార్గత అగ్నిలా మండుతుంది. అది గచ్చ పొదలను, బ్రహ్మ జెముడు చెట్లను కాల్చి, అడవి పొదల్లో రాజుకుని, దట్టమైన పొగస్థంభంలా పైకి లేస్తుంది. 1
Jeremiah 7:20కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.
Jeremiah 17:21యెహోవా చెప్పేదేమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండి విశ్రాంతి దినాన బరువులు మోయవద్దు. యెరూషలేము ద్వారాలగుండా వాటిని తీసుకు రావద్దు. 1