యిర్మీయా 22:19
అతణ్ణి యెరూషలేము ద్వారాల బయటికి ఈడ్చుకుపోయి అక్కడ పారేసి, గాడిదను పాతిపెట్టినట్టు పాతిపెడతారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
He shall be buried with the burial of an ass, drawn and cast forth beyond the gates of Jerusalem.
In Context
Cross References
1 Kings 14:10కాబట్టి నీ కుటుంబం మీదకు నేను కీడు రప్పిస్తాను. ఇశ్రాయేలు వారిలో చిన్నవారనీ పెద్దవారనీ తేడా లేకుండా చెత్తనంతా పూర్తిగా కాల్చినట్టు మగపిల్లలందరినీ నిర్మూలం చేస్తాను.
2 Kings 9:35సేవకులు ఆమెని సమాధి చేయడానికి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఆమె పుర్రె, కాళ్ళు, అరచేతులూ తప్ప ఇంకేమీ కనపడలేదు.
Jeremiah 15:3చంపడానికి కత్తినీ, చీల్చడానికి కుక్కలనూ, తినివేయడానికీ నాశనం చేయడానికీ ఆకాశ పక్షులనూ, భూమి మీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఈ నాలుగు రకాల బాధలు వారికి వస్తాయి.” ఇది యెహోవా వాక్కు. 1
Jeremiah 36:30ఆ కారణంగా యూదా రాజైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నాడు. “దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీ వారసులు ఎవరూ ఉండరు. పగలు ఎండలో, రాత్రి గడ్డ కట్టిన మంచులో పాడైపోయేలా నీ శవాన్ని పారేస్తారు.
Ezekiel 39:5నువ్వు నేల మీద పడి చనిపోతావు. ఈ మాట నేనే చెబుతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.