యిర్మీయా 25:18
వాళ్ళు ఈ రోజు ఉన్నట్టుగా అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉండడానికి యెరూషలేముకూ యూదా పట్టణాలకూ దాని గొప్ప రాజులకూ దాని అధిపతులకూ తాగించాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
19మిగతా రాజ్యాలు కూడా తాగాల్సి వచ్చింది. ఐగుప్తురాజు ఫరో, అతని సేవకులూ అతని అధికారులూ అతని పరివారమంతా,
Cross References
Joshua 6:18శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు.
2 Kings 22:19ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.
Nehemiah 9:36దేవా, ఆలకించు, మేము బానిసత్వంలో ఉన్నాం. భూమి ఫలాలను, దాని సమృద్దిని అనుభవించమని నువ్వు మా పూర్వీకులకు అనుగ్రహించిన భూమి మీద మేము బానిసలుగా బతుకుతున్నాం.
Isaiah 51:17యెరూషలేమా! లే. లేచి నిలబడు. 1 యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! 1 నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు. 1
Jeremiah 13:3యెహోవా వాక్కు నాకు రెండోసారి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
Jeremiah 19:3“యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది. 1