యిర్మీయా 25:33
ఆ రోజు యెహోవా చేత హతం అయిన వాళ్ళు భూమి ఒక అంచు నుంచి మరొక అంచు వరకూ ఉంటారు. వాళ్ళ కోసం ఎవరూ ఏడవరు. వాళ్ళను పోగుచేయరు. పాతిపెట్టరు. పెంటలాగా వారి శవాలు నేల మీద పడి ఉంటాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 79:3నీళ్లలాగా వారి రక్తాన్ని యెరూషలేము చుట్టూ పారబోశారు. వాళ్ళను పాతిపెట్టేవారు ఎవరూ లేరు. 1
Isaiah 5:25దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. 1 ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. 1 వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. 1 ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది. 1
Isaiah 66:16అగ్నితో తన కత్తితో మనుషులందరినీ యెహోవా శిక్షిస్తాడు. యెహోవా చేతుల్లో అనేకమంది చస్తారు. 1
Jeremiah 9:21మరణం మన ఇంటి కిటికీల గుండా ఎక్కుతూ ఉంది. మన రాజభవనాల్లో అడుగు పెడుతూ ఉంది. 1 అది వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గాల్లో యువకులు లేకుండా వారిని నాశనం చేస్తున్నది. 1
Jeremiah 16:4“వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.” 1
Ezekiel 21:11కాబట్టి ఆ కత్తిని మెరుగు పెట్టడానికి అప్పగించడం జరుగుతుంది. ఆ తరువాత అది చేతికి వస్తుంది. ఆ కత్తి పదునుపెట్టి ఉంది! హతం చేసేవాడి చేతికి ఇవ్వడానికి ఆ కత్తి మెరుగు పెట్టి ఉంది.