యిర్మీయా 25:35
కాపరులకు దాక్కునే చోటు ఉండదు. మందలోని శ్రేష్ఠమైన వాటికి దాక్కునే చోటు లేదు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the shepherds shall have no way to flee, nor the principal of the flock to escape.
In Context
Cross References
Isaiah 2:12గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు. 1
Jeremiah 32:4యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఇప్పటికే అతణ్ణి బబులోను రాజు చేతికి అప్పగించడం జరిగింది. అతని నోరు రాజు నోటితో మాట్లాడుతుంది. అతని కళ్ళు రాజు కళ్ళను చూస్తాయి.
Jeremiah 37:17తరువాత రాజైన సిద్కియా అతన్ని రప్పించడానికి ఒకణ్ణి పంపి, అతన్ని తన ఇంటికి పిలిపించి “యెహోవా దగ్గర నుంచి ఏ మాటైనా వచ్చిందా?” అని ఏకాంతంగా అతన్ని అడిగాడు. యిర్మీయా “వచ్చింది, నిన్ను బబులోను రాజు చేతికి అప్పగించడం జరుగుతుంది” అన్నాడు.
Jeremiah 38:23నీ భార్యలందరినీ, నీ పిల్లలనూ కల్దీయుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నువ్వు కూడా వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు. బబులోను రాజుకు దొరికిపోతావు గనుక ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చడానికి నువ్వే కారణం అవుతావు.’”
Jeremiah 52:8కానీ కల్దీయుల సైన్యం రాజును తరిమింది. యెరికో సమీపంలోని యోర్దాను నదీలోయ మైదాన ప్రాంతంలో వాళ్ళు సిద్కియాను తరిమి పట్టుకున్నారు. అతని సైన్యం అతణ్ణి విడిచి పెట్టి కకావికలై పోయారు.
Ezekiel 17:15కాని యెరూషలేము రాజు గుర్రాల కోసమూ, సైన్యం కోసమూ ఐగుప్తు రాజు దగ్గరికి రాయబారులను పంపడం ద్వారా తిరుగుబాటు చేశాడు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అలాంటి పనులు చేసి అతడు తప్పించుకుంటాడా? నిబంధనను మీరినవాడు తప్పించుకుంటాడా?