Jeremiah 27:21
యెహోవా మందిరంలో యూదా రాజు రాజ భవనంలో యెరూషలేములోని మిగిలిన పాత్రలను గురించి ఇశ్రాయేలు దేవుడు సేనల అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 20:17రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.
Ezra 1:7ఇవి కాక, నెబుకద్నెజరు యెరూషలేము నుండి దోచుకుని వచ్చి తన దేవుళ్ళ గుడుల్లో ఉంచిన యెహోవా మందిర ఉపకరణాలను కోరెషు రాజు బయటికి తీయించాడు.
Isaiah 39:6రాబోయే రోజుల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటిలో ఉన్న సమస్తాన్నీ, ఈ రోజువరకూ నీ పూర్వికులు పోగుచేసి దాచిపెట్టినదంతా బబులోను పట్టణానికి దోచుకుపోతారని సేనల అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు.
Lamentations 1:10దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి. దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.