యిర్మీయా 29:18
తరువాత ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నేను వాళ్ళను తరుముతాను. భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటి దృష్టిలో వాళ్లను ఒక అసహ్యంగా చేస్తాను. నేను వాళ్ళను చెదరగొట్టిన దేశాల్లో వాళ్ళను శాపానికీ, తృణీకారానికీ, ఎగతాళికీ ప్రతీకగా చేస్తాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:33జనాల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి కత్తి దూసి మీ వెంటబడి తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ ఊళ్లు పాడుబడిపోతాయి.
Deuteronomy 28:64యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు.
1 Kings 9:7నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో ఉండకుండాా వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం నేను పవిత్ర పరచిన ఈ మందిరాన్ని నా సన్నిధిలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు వివిధ ప్రజల మధ్యలోకి చెదరిపోయి ఒక సామెతగా, అపహాస్యంగా అవుతారు.
2 Chronicles 29:8అందుచేత యెహోవా ఉగ్రత యూదామీదా, యెరూషలేము మీదా పడింది. మీరు కన్నులారా చూస్తున్నట్టు ఆయన వారిని భీతికీ భయానికీ నిందకూ గురి చేశాడు.
Isaiah 65:15నేను ఎన్నుకున్న వారికి మీ పేరు శాపవచనంగా విడిచిపోతారు. నేను, యెహోవాను, మిమ్మల్ని హతం చేస్తాను. 1 నా సేవకులను వేరే పేరుతో పిలుస్తాను. 1
Jeremiah 18:16వాళ్ళ దేశం పాడైపోతుంది. అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది. ఆ దారిన వెళ్లేవాళ్ళంతా వణికిపోతూ తమ తలలూపుతారు. 1