యిర్మీయా 30:16
కాబట్టి, నిన్ను దిగమింగే వాళ్ళెవరో, వాళ్ళనే దిగమింగడం జరుగుతుంది. నీ ప్రత్యర్దులందరూ బందీలుగా చెరలోకి వెళ్తారు. నిన్ను దోచుకున్నవాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. నిన్ను కొల్లగొట్టిన వాళ్ళను కొల్లసొమ్ముగా చేస్తాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 23:22మీరు ఆయనకు లోబడి ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే నేను మీ శత్రువులకు శత్రువుగా, మీ విరోధులకు విరోధిగా ఉంటాను.
1 Samuel 17:53తరువాత ఇశ్రాయేలువారు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగి వచ్చి వారి డేరాల్లో ఉన్నదంతా దోచుకున్నారు.
Psalms 137:8నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు. 1
Isaiah 14:2ఇతర జాతులు వాళ్ళను తమ సొంత దేశానికి తీసుకు పోతారు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వాళ్ళను దాసదాసీలుగా ఉపయోగించుకుంటారు. తమను బందీలుగా పట్టుకున్న వాళ్ళను వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు. తమను బాధించిన వాళ్ళ మీద పరిపాలన చేస్తారు. 1
Isaiah 41:11నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు. 1 నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు 1
Isaiah 54:15ఎవరైనా చిక్కు తెస్తే, అది నా వలన కాదు. చిక్కు తెచ్చే వారెవరైనా ఓడిపోతారు. 1