యిర్మీయా 32:40
నేను వాళ్ళ నుంచి తిరిగిపోకుండా ఉండేలా వాళ్లతో ఒక నిత్యమైన నిబంధన స్థిరం చేస్తాను. వాళ్లకు మేలు చేసేందుకు, వాళ్ళు నన్ను వెంబడించడం విడిచిపెట్టకుండా ఉండేలా వాళ్ళ హృదయాల్లో నా పట్ల గౌరవం కలిగిస్తాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 17:7నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.
Psalms 80:19యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.
Isaiah 55:3శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. 1 నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను. 1
Jeremiah 24:7నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.”
Jeremiah 50:5సీయోనుకు వెళ్ళే మార్గం ఏది అంటూ వాకబు చేస్తారు. ఆ మార్గంలో ప్రయాణం మొదలు పెడతారు. 1 ఉల్లంఘించలేని శాశ్వత నిబంధనలో యెహోవాను కలవడానికి కలిసి వెళ్తారు.
Ezekiel 36:27నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను.