యిర్మీయా 32:7
చూడు, మీ బాబాయి షల్లూము కొడుకు హనమేలు నీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ‘అనాతోతులో ఉన్న నా భూమిని కొనుక్కో. ఎందుకంటే దాన్ని కొనుక్కునే హక్కు నీకే ఉంటుంది.’”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
6యిర్మీయా ఇలా అన్నాడు. “యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, 1
Cross References
Leviticus 25:23భూమిని శాశ్వతంగా వేరొకడికి అమ్మకూడదు. ఎందుకంటే భూమి నాది. మీరు నా దగ్గర తాత్కాలికంగా నివసిస్తున్న పరదేశులు.
Leviticus 25:25నీ సోదరుడు పేదరికం వల్ల తన ఆస్తిలో కొంత అమ్ముకుంటే అతని సమీప బంధువు దాన్ని విడిపించడానికి ఎదుటికి వచ్చి తన సోదరుడు అమ్మినదాన్ని విడిపిస్తాడు.
Leviticus 25:49అతని బాబాయిగాని బాబాయి కొడుకు గాని అతని వంశంలోని రక్తసంబంధిగాని అతణ్ణి విడిపించవచ్చు. అవసరమైన విడుదల వెల అతనికి దొరికితే అతడు తనను తాను విడిపించుకోవచ్చు.
Joshua 21:18అనాతోతు, దాని పచ్చిక మైదానాలనూ అల్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
1 Kings 14:5యెహోవా అహీయాతో “యరొబాము కొడుకు జబ్బుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి నీ దగ్గర సలహా కోసం యరొబాము భార్య వస్తూ ఉంది. ఆమె మారువేషం వేసుకుని మరొక స్త్రీలాగా నటిస్తుంది. నేను నీకు చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి” అన్నాడు.
Jeremiah 11:21“నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు” అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,