Jeremiah 33:21
అప్పుడు, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుని పాలించే వారసుడు అతనికి ఉండకుండా మానడని అతనితో, నా సేవకులైన లేవీయులతో, యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్ధం అవుతుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 23:5నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు. 1
2 Chronicles 21:7అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.
Psalms 89:36చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది. 1
Psalms 132:17అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను. 1
Isaiah 55:3శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. 1 నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను. 1
Jeremiah 33:18నా సన్నిధిలో నిత్యం దహన బలులు అర్పించడానికీ, నైవేద్యాలు అర్పించడానికీ, ధాన్య అర్పణలు అర్పించడానికీ యాజకులైన లేవీయుల్లో ఒకడు ఎప్పుడూ లేకుండా ఉండడు.”