యిర్మీయా 38:19
అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో “కల్దీయుల పక్షంగా ఉన్న యూదులకు భయపడుతున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తే, వాళ్ళు నాపట్ల చెడ్డగా ప్రవర్తిస్తారు,” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Judges 9:54అప్పుడతను తన ఆయుధాలు మోసే సేవకుణ్ణి కంగారుగా పిలిచి “ఒక స్త్రీ నన్ను చంపిందని నన్ను గూర్చి ఎవరూ అనుకోకుండా, నీ కత్తి దూసి నన్ను చంపు” అని చెప్పాడు. ఆ సేవకుడు అతన్ని పొడవగా అతడు చచ్చాడు.
1 Samuel 15:24అప్పుడు సౌలు “ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను.
Job 31:34జన సమూహానికి భయపడి, కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయటికి వెళ్లకుండా దాక్కోలేదు. 1
Isaiah 45:9మట్టికుండ పెంకుల్లో ఒక పెంకులాటి ఒకడు తనను చేసిన వానితో వాదిస్తే వాడికి బాధ. 1 బంకమట్టి కుమ్మరితో ‘నువ్వేం చేస్తున్నావ్?’ అనవచ్చా? ‘నువ్వు చేసినపుడు నీకు చేతులు లేవా?’ అనగలదా? 1
Isaiah 57:11ఎవరికి జడిసి, భయపడి అంత మోసం చేశావు? 1 నా గురించి ఆలోచించలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. 1 చాలా కాలం నేను మౌనంగా లేను గదా! అయితే నువ్వు నన్నంతగా పట్టించుకోలేదు. 1
Jeremiah 38:22యూదా రాజమందిరంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను అధిపతుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు, చూడు! ఆ స్త్రీలు నిన్ను చూసి ఇలా అంటారు, 1 ‘నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నిన్ను నాశనం చేశారు. 1 నీ పాదాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళు నిన్ను విడిచి పెట్టి పారిపోతారు.