యిర్మీయా 38:9
“రాజా, నా ప్రభూ, ఆ గోతిలో వేసిన యిర్మీయా అనే ప్రవక్త పట్ల ఈ మనుషులు చేసిందంతా దుర్మార్గమే. అతడు ఆకలితో చావాలని అతన్ని గోతిలో పడేశారు. ఎందుకంటే పట్టణంలో ఆహారం ఇంక లేదు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
8కాబట్టి ఎబెద్మెలెకు రాజ గృహంలోనుంచి వెళ్లి రాజుతో ఇలా అన్నాడు,
Cross References
Esther 7:4నేను, నా జాతి ప్రజలు, సమూల నాశనానికి, సంహారానికి, తుడిచి పెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ, మగ బానిసలుగా అమ్ముడుబోయినట్టైతే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా.”
Proverbs 24:11మృత్యు ముఖంలో ఉన్న వారిని తప్పించు. నాశనం వైపుకు తూలుతున్న వారిని చేతనైతే రక్షించు.
Jeremiah 19:9వాళ్ళు తమ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను. తమ ప్రాణం తీయాలని చూసే శత్రువులు ముట్టడి వేసి బాధించే కాలంలో వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు. 1
Jeremiah 39:17ఆ రోజున నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు భయపడే మనుషుల చేతికి నిన్ను అప్పగించడం జరగదు’ అని యెహోవా అంటున్నాడు,