యిర్మీయా 43:10
తర్వాత వాళ్లకిలా ప్రకటించు. “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Kings 20:12తమ గుడారాల్లో బెన్హదదు, అతని తోటి రాజులు తాగుతూ ఉన్నప్పుడు ఈ కబురు విన్నారు. కాబట్టి అతడు తన సేవకులను పిలిపించి “యుద్ధానికి సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు పట్టణం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. 1 అహాబు బెన్హదదును ఓడించడం
Psalms 18:11తన చుట్టూ అంధకారాన్ని, దట్టమైన వర్షమేఘాలను గుడారంగా చేశాడు. 1
Psalms 31:20మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు. 1
Jeremiah 1:15ఇదిగో, నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాల జాతులన్నిటినీ పిలుస్తాను. వారిలో ప్రతివాడూ యెరూషలేము ద్వారాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలన్నిటికీ యూదా పట్టణాలన్నిటికీ ఎదురుగా తమ ఆసనాలు వేసుకుని కూర్చుంటారు.
Jeremiah 27:6ఇప్పుడు దేశాలన్నిటినీ నా సేవకుడూ బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు ఇస్తున్నాను. భూమి మీద తిరిగే జంతువులను కూడా అతణ్ణి సేవించడానికి ఇస్తున్నాను.
Jeremiah 46:27“కానీ నా సేవకుడవైన యాకోబూ, నువ్వు భయపడకు. ఇశ్రాయేలూ, వ్యాకుల పడకు. ఎందుకంటే చూడు, నిన్ను దూర ప్రాంతాల్లోనుండి వెనక్కి తీసుకు వస్తాను. బందీలుగా ఉన్న నీ సంతానాన్ని చెరలో ఉన్న దేశం నుండి తీసుకు వస్తాను. యాకోబు తిరిగి వస్తాడు. అతనికి శాంతి లభిస్తుంది. క్షేమంగా ఉంటాడు. అతణ్ణి భయపెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు.