యిర్మీయా 48:1
సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా మోయాబును గూర్చి ఇలా అంటున్నాడు. 1 నెబోకు బాధ, అది సర్వ నాశనమౌతుంది. కిర్యతాయిమును వశం చేసుకున్నారు. అది అవమానాన్ని ఎదుర్కుంటుంది. 1 ఆమె కోటను కూల్చివేశారు. అవమానం పాలు చేశారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 19:37అతని పెద్ద కూతురు ఒక కొడుక్కి జన్మనిచ్చింది. వాడికి మోయాబు అనే పేరు పెట్టింది. అతడే నేటి మోయాబీయులకు మూల పురుషుడు.
Numbers 32:3“అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బెయోను అనే ప్రాంతాలు,
Numbers 33:47అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
Isaiah 15:1మోయాబు గురించి ప్రకటన. 1 ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. 1 ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది. 1
Isaiah 25:12మోయాబూ, నీ ప్రాకారాలను, ఎత్తయిన కోటలను ఆయన కూల్చి వేస్తాడు. వాటిని నేలకు అణగదొక్కి ధూళి పాలు చేస్తాడు.
Jeremiah 9:26అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.”