యిర్మీయా 48:38
మోయాబులో ప్రతి ఇంటి కప్పు పైనా, ప్రతి వీధిలోనూ ఏడ్పులు వినిపిస్తున్నాయి. “ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పనికిరాని కుండను పగలగొట్టినట్టు నేను మోయాబును పాడు చేశాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 15:3తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. 1 వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. 1
Isaiah 30:14కుమ్మరి చేసిన మట్టి కుండ పగిలినట్టు ఆయన దాన్ని పగలగొడతాడు. దాన్ని ఆయన విడిచి పెట్టడు. దాని ముక్కల్లో ఒక్క పెంకు కూడా పొయ్యిలో నుండి నిప్పు కణికలను తీయడానికి గానీ కుండలో నుండి నీళ్ళుతోడటానికి గానీ పనికి రాదు. 1
Jeremiah 25:34కాపరులారా, ఏడవండి. సాయం కోసం కేకలు పెట్టండి. మందలోని నాయకులారా, నేల మీద పడి దొర్లండి. మీరు చావడానికి రోజులు దగ్గరపడ్డాయి. మీరు చెదిరిపోయే రోజు వచ్చింది. ఎంపిక చేసిన గొర్రె పొట్టేళ్ళు కింద పడినట్టు మీరు పడతారు. 1
Romans 9:21ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా?
Revelation 2:27అతడు ఇనప దండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్టు ముక్కలు చెక్కలు చేస్తాడు.