యిర్మీయా 5:15
ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, దూరం నుండి మీ మీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. అది చాలా పురాతనమైన జనం. 1 దాని భాష నీకు రాదు. ఆ జనం పలికే మాటలు నీకు అర్థం కావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
16వారి అమ్ముల పొది తెరచిన సమాధిలాంటిది. వారంతా గొప్ప యోధులు. 1
Cross References
Deuteronomy 28:49దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు.
Isaiah 5:26ఆయన దూర ప్రజలకు సంకేతంగా జెండా ఎత్తుతాడు. 1 భూమి కొనల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. 1 అదిగో, వారు ఆలస్యం లేకుండా వేగంగా వస్తున్నారు. 1
Isaiah 29:3నేను నీకు విరోధంగా నీ చుట్టూ శిబిరం కడతాను. నీకు ఎదురుగా కోట కడతాను. ముట్టడి వేస్తాను. నీకు విరోధంగా ముట్టడి పనులను అధికం చేస్తాను. 1
Isaiah 33:19నువ్వు అర్థం చేసుకోలేని తెలియని భాష మాట్లాడుతూ తిరస్కరించే ఆ జనాన్ని నువ్వు చూడవు. 1
Jeremiah 2:26దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది. 1 చెట్టుతో “నువ్వు మా తండ్రివి” అనీ, రాయితో “నువ్వే నన్ను పుట్టించావు” అనీ చెబుతూ, 1 ఇశ్రాయేలు ప్రజలు, వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతారు. 1
Jeremiah 5:11ఇశ్రాయేలు, యూదా ప్రజలు నాకు పూర్తిగా ద్రోహం చేశారు. ఇదే యెహోవా వాక్కు. 1