Jeremiah 5:7
నీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని వారి పేరున ప్రమాణం చేస్తారు. 1 నేను వారిని సమృద్ధిగా పోషించాను కానీ వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్ళలో సమావేశం అవుతారు. వారిని నేనెందుకు క్షమించాలి? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 20:10వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగు వాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడికి-ఆ వ్యభిచారికి, వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి.
Deuteronomy 32:15+ 32:15 నీతిపరుడు, అంటే ఇశ్రాయేల్యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, 1 మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. 1 యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. 1 తన రక్షణ శిలను నిరాకరించాడు. 1
Joshua 23:7మీ దగ్గర మిగిలి ఉన్న ఈ రాజ్యాలతో కలిసిపోవద్దు. వారి దేవుళ్ళ పేరులు ఎత్తవద్దు, వాటి తోడని ప్రమాణం చేయవద్దు, వాటిని పూజించవద్దు. వాటికి నమస్కరించవద్దు.
Psalms 50:18నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు. 1
Jeremiah 2:31ఇప్పటి తరం ప్రజలు యెహోవా చెప్పే మాట వినండి, నేను ఇశ్రాయేలుకు ఒక అరణ్యం లాగా అయ్యానా? 1 గాఢాంధకారంతో నిండిన దేశంలా అయ్యానా? “మాకు స్వేచ్ఛ లభించింది, ఇంక నీ దగ్గరికి రాము” అని నా ప్రజలెందుకు చెబుతున్నారు? 1
Jeremiah 3:19నిన్ను నా కొడుకుగా చేసుకుని, ఏ జనానికీ లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను. 1 నువ్వు నా తండ్రీ అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను. 1