John 21:15
వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 33:13అతడు “నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.
2 Kings 20:3“యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.
Isaiah 40:11ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. 1 పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు. 1
Jeremiah 23:4నేను వాటి మీద కాపరులను నియమిస్తాను. ఇకనుంచి అవి భయపడకుండా, బెదరి పోకుండా, వాటిలో ఒకటైనా తప్పిపోకుండా వారు నా గొర్రెలను మేపుతారు. ఇది యెహోవా వాక్కు.” 1
Ezekiel 34:23వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
Matthew 10:37నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.