Jonah 1:5
అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 24:3దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు.
Job 2:4అప్పుడు సాతాను “మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు గదా.
Psalms 148:8అగ్నిపర్వతాలూ, వడగళ్ళూ, మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ, యెహోవాను స్తుతించండి. 1
Isaiah 44:17మిగిలిన భాగాన్ని తాను దేవుడుగా భావించే విగ్రహాన్ని చేసుకుంటాడు. 1 దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ ‘నా దేవుడివి నువ్వే, నన్ను రక్షించు’ అని ప్రార్థిస్తాడు. 1
Jeremiah 2:28నీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఆపదలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారేమో. 1 యూదా, నీ పట్టణాలెన్ని ఉన్నాయో నీ దేవతా విగ్రహాలు కూడా అన్ని ఉన్నాయి కదా. 1
Jonah 1:6అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.