యెహో 10:40
తరువాత యెహోషువ పర్వత ప్రాంతాలనూ, దక్షిణ ప్రదేశాన్నీ షెఫేలా ప్రదేశాన్నీ చరియల ప్రదేశాన్నీ వాటి రాజులందరినీ జయించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా అతడు ఏదీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్నీ నిర్మూలం చేశాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
41కాదేషు బర్నేయ మొదలు గాజా వరకూ గిబియోను వరకూ గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు.
Cross References
Exodus 23:31ఎర్ర సముద్రం నుంచి ఫిలిష్తీయుల సముద్రం దాకా, ఎడారి నుంచి నది దాకా మీకు సరిహద్దులు నియమిస్తాను. ఆ దేశ నివాసులను మీ చేతికి అప్పగిస్తాను. మీరు మీ ఎదుట నుండి వాళ్ళను వెళ్లగొడతారు.
Exodus 23:33వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు. వాళ్ళను ఉండనిస్తే వాళ్ళు మీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు. + 23:33 వాళ్ళు వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే, అని కూడా అర్థం వస్తుంది. అంటే ఆ దేశంలో విగ్రహ పూజ జరగకూడదు అని అర్థం. వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మీకు ఉరిగా పరిణమిస్తుంది.
Numbers 13:17వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. “మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి.
Deuteronomy 2:34అప్పుడున్న అతని పట్టణాలనూ, వాటిలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ ఏదీ మిగలకుండా నాశనం చేశాం.
Deuteronomy 7:24ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచి వేయాలి. మీరు వారిని నాశనం చేసేవరకూ ఏ మనిషీ మీ ఎదుట నిలవలేడు.
Deuteronomy 26:16ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకూ లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు మీ హృదయ పూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి.