యెహో 15:8
ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Joshua 18:16ఉత్తరం వైపు రెఫాయీయుల లోయలో ఉన్న బెన్ హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండప్రక్కనుండి దక్షిణంగా బెన్‌హిన్నోము లోయ గుండా యెబూసీయుల ప్రదేశం వరకూ సాగి ఏన్‌రోగేలు వరకూ వెళ్ళింది.
Judges 1:8యూదావంశం వారు యెరూషలేముపై కూడా యుద్ధం చేసి దాన్ని పట్టుకుని కొల్లగొట్టి ఆ పట్టణాన్ని కాల్చివేశారు.
Judges 19:10కానీ అతడు ఆ రాత్రి అక్కడ గడపడానికి ఇష్టపడలేదు. అతడు లేచి ప్రయాణమయ్యాడు. ప్రయాణం సాగించి యెబూసు (అంటే యెరూషలేము) దగ్గరికి వచ్చాడు. అతని ఉంపుడుగత్తెతో పాటు అతనితో కూడా జీను కట్టిన రెండు గాడిదలూ ఉన్నాయి.
2 Samuel 5:22ఫిలిష్తీయులు మళ్ళీ వచ్చి రెఫాయీము ప్రాంతంలో మాటు వేశారు.
2 Chronicles 28:3బెన్ హిన్నోము లోయలో ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటనుంచి యెహోవా తోలివేసిన ప్రజల నీచమైన అలవాట్ల ప్రకారం తన కొడుకులను దహనబలిగా అర్పించాడు.
Isaiah 17:5అది పంట కోసేవాడు ధాన్యాన్ని సమకూర్చినట్టుగా, అతడి చేయి కంకులను కోసినట్టుగా ఉంటుంది. 1 రెఫాయీము లోయలో ఒకడు పరిగె సేకరించినట్టుగా ఉంటుంది. 1