యెహో 6:17
“ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 27:21ఆ పొలం సునాద సంవత్సరంలో విడుదల అయితే అది ప్రతిష్ఠించిన పొలం లాగానే యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది. ఆ ఆస్తి యాజకునిది అవుతుంది.
Numbers 21:2ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని “నువ్వు మాకు ఈ జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం” అన్నారు.
Joshua 2:1నూను కుమారుడు యెహోషువ ఇద్దరు గూఢచారులను పిలిచి “మీరు వెళ్ళి ఆ దేశాన్ని, మరి ముఖ్యంగా యెరికో పట్టణం చూడండి” అని వారితో చెప్పి, షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపాడు. వారు వెళ్లి రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ బస చేశారు.
Joshua 2:22వారు వెళ్లి కొండలు ఎక్కి తమను తరిమేవారు తిరిగి వచ్చేవరకూ మూడు రోజులు అక్కడే ఉండిపోయారు. తరిమేవారు ఆ మార్గమంతా వారిని వెదికారు గానీ వారు కనబడలేదు.
Joshua 7:1శాపానికి గురైన దాన్ని నాశనం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు అపనమ్మకంగా ప్రవర్తించారు. యూదాగోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడు, ఆకాను నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని సొంతానికి తీసుకున్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు.
Ezra 10:8ప్రధానులు, పెద్దలు నిర్ణయించినట్టుగా మూడు రోజుల్లోగా ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి, వాటిని దేవుని మందిరపు ఆస్తిగా ప్రకటించాలని, వాళ్ళను సమాజం నుండి బహిష్కరించాలని తీర్మానం చేశారు.