యెహో 6:22
అయితే యెహోషువ “ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకు రండి” అని ఆ దేశాన్ని వేగు చూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Joshua 2:14అందుకు వారు ఆమెతో “నీవు మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావకుండా ఉండేలా మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలిస్తాం, యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చేటప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేస్తాం” అన్నారు.
Joshua 9:15యెహోషువ ఆ వచ్చిన వారితో సంధి చేసి వారు చావకుండేలా వారితో ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు కూడా వారితో ప్రమాణం చేశారు.
Judges 1:25అతడు ఆ పట్టణంలోకి వెళ్ళే దారి వాళ్లకు చూపించినప్పుడు, వాళ్ళు ఆ పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే, ఆ వ్యక్తిని, అతని కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు.
2 Samuel 21:7అతడు సౌలు కొడుకు యోనాతానుకు యెహోవా పేరిట చేసిన ప్రమాణం కారణంగా యోనాతాను కొడుకు మెఫీబోషెతును కాక,
Ezekiel 17:13అతడు రాజు వంశస్థుల్లో ఒకణ్ణి తీసుకుపోయి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. అతనితో ఒట్టు పెట్టించాడు. రాజ్యం బలహీనం కావడం కోసం, అది మళ్ళీ కోలుకోకుండా ఉండటానికి దేశంలో ఉన్న బలవంతులను అతడు తీసుకు వెళ్లి పోయాడు.,
Ezekiel 17:18ఎందుకంటే రాజు తన చేతులు కలిపి ప్రమాణం చేశాడు. నిబంధనను భంగపరచడం ద్వారా తాను చేసిన ప్రమాణాన్ని తృణీకరించాడు. అతడు తప్పించుకోలేడు.”