Joshua 7:19
అప్పుడు యెహోషువ ఆకానుతో “నా కుమారా, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు మహిమ కలిగేలా, ఆయన ముందు ఏదీ దాచకుండా ఒప్పుకో, నీవు చేసినదాన్ని నాకు చెప్పు” అని అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
20అందుకు ఆకాను యెహోషువతో “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే.
Cross References
Numbers 5:6పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదన్నా పాపం చేసి నాకు ద్రోహం చేస్తే ఆ వ్యక్తి అపరాధి అవుతాడు.
1 Samuel 6:5కాబట్టి మీకు వచ్చిన గడ్డలకూ భూమిని పాడు చేసే పందికొక్కులకూ సూచనగా ఉన్న ఈ గడ్డలను, పందికొక్కుల రూపాలను తయారుచేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ కలిగించాలి. అప్పుడు మీకూ మీ దేవుళ్ళకూ మీ భూమికీ కీడు కలిగిస్తున్న ఆయన తన హస్తాన్ని తొలగించవచ్చు.
2 Kings 20:15“నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు.
2 Chronicles 33:12బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు.
Ezra 10:11కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”
Psalms 51:3నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది. 1