Joshua 8:22
తక్కిన వారు పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చారు. అలా ఈ వైపు కొందరు ఆ వైపు కొందరు ఉండగా హాయివారు మధ్యలో చిక్కుకుపోవడం వల్ల ఇశ్రాయేలీయులు వారిని హతం చేశారు. వారిలో ఒక్కడూ మిగల్లేదు, ఒక్కడూ తప్పించుకోలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
23వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరికి తీసుకువచ్చారు.
Cross References
Deuteronomy 7:2తరువాత, మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు. వారిపై దయ చూపకూడదు.
Joshua 10:28ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేసాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకూ చేశాడు.
Job 20:5దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది. 1
1 Thessalonians 5:3ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.