న్యాయా 14:19
యెహోవా ఆత్మ అతని మీదికి మళ్ళీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అష్కెలోనుకు వెళ్లి అక్కడివారిలో ముప్ఫై మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ తన తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
20సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు.
Cross References
Judges 3:10యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి యుద్ధానికి బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించాడు. అతడు కూషన్రిషాతాయిమును జయించాడు.
Judges 14:6యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
1 Samuel 6:4ఫిలిష్తీయులు “మనం ఆయనకు పరిహారంగా చెల్లించాల్సిన అర్పణ ఏమిటి?” అని వారిని అడగగా వారు “మిమ్మలనూ మీ పెద్దలనూ పీడిస్తున్న తెగులు ఒక్కటే కాబట్టి ఫిలిష్తీయుల పెద్దల లెక్క ప్రకారం ఐదు బంగారపు గడ్డల రూపాలు, ఐదు బంగారపు పందికొక్కుల రూపాలు చెల్లించాలి.
1 Samuel 11:6సౌలు ఆ మాటలు వినగానే దేవుని ఆత్మ అతన్ని తీవ్రంగా ఆవహించాడు. అతడు ఆగ్రహంతో