న్యాయా 16:18
అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమైంది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. “మరోసారి రండి. ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు” అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Judges 16:5ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో “నువ్వు అతణ్ణి ఏమార్చి అతడి గొప్ప బలం దేంట్లో ఉందో, మేము అతణ్ణి బంధించడానికి ఎలా అతణ్ణి గెలవవచ్చో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణచివేస్తాం. నువ్వు దీన్ని చేస్తే మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి + 16:5 పదకొండు వందల వెండి 60 కిలోగ్రాములు నాణేలిస్తాం” అన్నారు.
Psalms 62:9నిజానికి తక్కువ స్థాయి మనుషులు ఎందుకూ పనికిరానివారు. గొప్పవారేమో మాయలాంటివారు. త్రాసులో వారంతా తేలిపోతారు. వారందరినీ కలిపి తూచినా వారు గాలికన్నా తేలికగా ఉన్నారు. 1
Jeremiah 9:4మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 1 ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే. 1 ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు. 1
Ephesians 5:5మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.