న్యాయా 16:20
ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. సంసోను నిద్ర లేచి “ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను” అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 14:9కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు” అన్నారు. కాని, ఆ సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు.
Numbers 14:43ఎందుకంటే, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరారు. మీరు ఖడ్గం చేత చనిపోతారు. మీరు యెహోవాను అనుసరించ లేదు గనక ఇంక యెహోవా మీకు తోడుగా ఉండడు” అని చెప్పాడు.
Joshua 7:12కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వారు తమకు తామే నాశనానికి గురయ్యారు కాబట్టి తమ శత్రువులకు వెన్నుచూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండాా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను.
Judges 16:9ఆమె ఇంట్లోని లోపలి గదిలో కొంతమంది దాగి ఉన్నారు. ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. అతడు తనను బంధించిన వింటినారలను కాలిపోయిన నారపోగుల్లా తెంపేశాడు. కాబట్టి అతని బలం వెనుక రహస్యం వెల్లడి కాలేదు.
1 Samuel 16:14యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది,
1 Samuel 18:12యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు.