న్యాయా 18:29
తమ పూర్వీకుడైన దాను పేరును బట్టి ఆ పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అంతకు ముందు ఆ పట్టణం పేరు లాయిషు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 30:6అప్పుడు రాహేలు “దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు” అనుకుని అతనికి “దాను” అని పేరు పెట్టింది.
Deuteronomy 34:1ఆ తరువాత మోషే మోయాబు మైదానాల నెబో కొండకు వెళ్ళాడు. యెరికోకు ఎదురుగా ఉన్న పిస్గా కొండ శిఖరం ఎక్కాడు. యెహోవా ఆ దేశం అంతటినీ మోషేకు చూపించాడు.
Judges 18:7అప్పుడు ఆ ఐదుగురు మనుష్యులు వెళ్లి లాయిషుకు వచ్చారు. అక్కడ జనం, సీదోనీయుల్లా భద్రంగా, నిర్భయంగా నివసించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని అధికారం చెలాయించేవాళ్ళు గానీ, బాధలు పెట్టేవాళ్ళు గానీ లేకపోవడం చూసారు. వాళ్ళు సీదోనీయులకు దూరంగా నివసించడమూ, వాళ్ళకు ఎవరితోనూ + 18:7 ఎవరితోనూ అరామియులు ఎలాంటి సంబంధాలు లేకపోవడమూ చూశారు.
2 Samuel 17:11నా ఆలోచన ఏమిటంటే, దాను నుండి బెయేర్షెబా వరకూ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీయులనందరినీ నాలుగు దిక్కులకు సమకూర్చుకుని నువ్వే స్వయంగా యుద్ధానికి బయలుదేరు.
1 Kings 15:20కాబట్టి బెన్హదదు ఆసా రాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపి, ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు ప్రాంతాలనూ నఫ్తాలి దేశాన్నీ కొల్లగొట్టాడు.