Judges 21:22
ఆ తరువాత ఆ అమ్మాయిల తండ్రులు గానీ సోదరులు గానీ మా దగ్గరికి వచ్చి వాదిస్తే మేము వారితో ‘మీరు కాస్త మా పట్ల దయ చూపండి. యుద్ధం కారణంగా వాళ్ళలో ప్రతి వాడికీ పెళ్ళి చేసుకోడానికి స్త్రీలు దొరకలేదు. కాబట్టి ఆ స్త్రీలను ఉండనివ్వండి. మీ అంతట మీరే వాళ్ళను పెళ్లికివ్వలేదు కాబట్టి శపథం విషయంలో మీరు నిరపరాధులు అవుతారు’ అని చెబుతాము” అన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 7:13ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతో పాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు.
Judges 21:7మిగిలిన వారికి ఎవరికీ మన కూతుళ్ళను పెళ్ళికి ఇవ్వకూడదని యెహోవా పేరుమీద శపథం చేశాం కదా, ఇప్పుడు మిగిలిన వారికి భార్యలు ఎవరు చూస్తారు? ఇక వారి విషయంలో మనం ఏం చేయగలం?”
Judges 21:18“ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా సరే, తన కూతుర్ని బెన్యామీనీయుడికి ఇస్తే వాణ్ణి నాశనం చేయాలని శపథం చేశాం. కాబట్టి మన కూతుళ్ళను వారికిచ్చి పెళ్ళి చేయకూడదు,” అని చెప్పుకున్నారు.
Mark 10:6కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు.
Philemon 1:9ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను.