Judges 3:1
ఇశ్రాయేలీయులకు కనానీయులకు జరిగిన యుద్ధాల గురించి తెలియని ఇశ్రాయేల్వాళ్ళందరినీ పరీక్షకు గురి చెయ్యడానికి యెహోవా ఈ శత్రు జాతులను అక్కడే ఉంచాడు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2ఇశ్రాయేలీయుల్లో కొత్త తరం వాళ్లకు యుద్ధం నేర్పించడానికి యెహోవా ఉండనిచ్చిన జాతులు ఇవి:
Cross References
Deuteronomy 7:22మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ ప్రజలను తొలగిస్తాడు. అడవి జంతువులు విస్తరించి మీకు ఆటంకంగా ఉండవచ్చు కాబట్టి వారినందరినీ ఒక్కసారే మీరు నాశనం చేయవద్దు. అది మీకు క్షేమకరం కాదు.
Deuteronomy 8:16చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.
Judges 2:21నేను నియమించిన షరతులు అనుసరించి వాళ్ళ పితరులు నడిచినట్టు వీళ్ళు కూడా యెహోవా షరతులు అనుసరించి నడుస్తారో లేదో ఆ జాతుల వలన ఇశ్రాయేలీయులను పరీక్షింఛి చూస్తాను.
2 Chronicles 32:31అయితే, అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోడానికి బబులోను పరిపాలకులు అతని దగ్గరికి రాయబారులను పంపారు. అతని హృదయంలోని ఉద్దేశమంతా తెలుసుకోవాలని దేవుడు అతణ్ణి పరీక్షకు విడిచిపెట్టాడు.
Proverbs 17:3వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే.
Jeremiah 17:9హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు? 1