Judges 8:1
అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో “నువ్వు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని అతనితో తీవ్రంగా వాదించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 19:41ఇలా ఉన్నప్పుడు ఇశ్రాయేలువారు రాజు దగ్గరికి వచ్చారు. “మా సహోదరులైన యూదావారు నిన్ను, నీ ఇంటివారిని దొంగిలించుకుని యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకు వచ్చారు?” అని అడిగారు.
Job 5:2తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు. 1
Ecclesiastes 4:4కష్టంతో, నైపుణ్యంగా చేసే ప్రతి పనీ వేరొకరి అసూయకి కారణం అవుతున్నదని నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది.
James 4:5ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా?